telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో హానికరమై లిక్కర్ బ్రాండ్స్..సర్కార్​ పై బోండా ఉమ ఫైర్​

tdp bonda uma counter on ycp comments

ఏపీలో హానికరమై లిక్కర్ బ్రాండ్స్..సర్కార్​ పై బోండా ఉమ ఫైర్​

ఏపీలో హానికరమై లిక్కర్ బ్రాండ్స్ విక్రయిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి రాకముందు ప్రచారం చేసుకున్న జగన్ అధికారంలోకొచ్చాక లిక్కర్ ని ఆదాయవనరుగా చేసుకున్నారని విమర్శించారు.

ఏపీలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా చూడనటువంటి హానికరమైన బ్రాండ్స్ ను తన ‘J-ట్యాక్స్’ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విక్రయిస్తోందని, ‘హైదరాబాద్ లో పేమెంట్.. తాడేపల్లిలో ఇండెంట్ జరుగుతోందని విమర్శించారు. కేవలం, మద్యంపైనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.300 కోట్ల పైచిలుకు కమీషన్లు కొట్టేసిందని ఆరోపించారు.

రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకే ధరలు పెంచామని చెబుతున్న ప్రభుత్వం హానికరమైన మద్యాన్ని ప్రజలకు సప్లయ్ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ‘జార్డీస్ బార్’ బ్రాండ్ విస్కీ, ‘బూమ్’ బీరును విక్రయిస్తున్నారని అన్నారు. మన దేశంలోనే కాదు జగన్ కు ఇష్టమైన దక్షిణాఫ్రికా దేశంలో కూడా ఈ బ్రాండ్ కనబడదని విమర్శించారు.

Related posts