telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భీష్మ : “వాట్టే బ్యూటీ” సాంగ్ ప్రోమో… స్టెప్స్ అదరగొట్టిన రష్మిక

Bheeshma

నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. శుక్రవారం సాయంత్రం ‘వాట్టే బ్యూటీ వీడియో ప్రోమో రిలీజ్ చేశారు. నితిన్, రష్మికల కెమిస్ట్రీ, నితిన్ స్టెప్స్ చాలా బాగున్నాయి. ఈ చిత్రానికి సంగీతం మహతి స్వర సాగర్ అందిస్తున్నారు. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ లో హీ ఈజ్ సో క్యూట్ పాటలో తన స్టెప్స్‌తో అలరించిన రష్మిక ఈ ‘వాట్టే బ్యూటీ’ ప్రోమోలో మాత్రం తన మూమెంట్స్‌తో అదరగొట్టేసింది. జస్ట్ ప్రోమోలోనే ఈ రేంజ్‌లో ఇరగదీస్తే ఇక ఫుల్ సాంగ్‌లో ఎలా చేసుంటుందో చూస్కోండి మరి.. ఈ ప్రోమోకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 2న ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 21న ‘భీష్మ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘లై’, ‘ఛల్ మోహనరంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి వరుస పరాజయాల తర్వాత చేస్తున్న ‘భీష్మ’ మూవీపైనే నితిన్ ఆశలు పెట్టుకున్నాడు.

Related posts