మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్‌ని నిర్మాతగా మార్చి.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై 50 కోట్ల బడ్జెట్లోనే ‘ఖైదీ నంబర్ 150’ని తీయించాడు చిరంజీవి. ఇక.. ఈ సినిమా బడ్జెట్‌కి రెట్టింపు లాభాలు దక్కాయి. కానీ.. ‘సైరా’ విషయంలో చిరు గురి తప్పింది. తాజాగా చిరంజీవి 152 చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మెగాస్టార్ 153వ చిత్రానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన చిరంజీవి కమర్షియల్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో పని చేయబోతున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. ఇటీవల చిరంజీవిని హరీశ్ కలిశాడట. మంచి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయమని చిరు అడగడటంతో హరీశ్.. ఆయన్ని మెప్పించేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో తలమునకలై ఉన్నాడట. మెగా క్యాంప్ హీరో వరుణ్‌తేజ్‌తో గత ఏడాది ‘గద్దలకొండ గణేశ్’ వంటి హిట్ సాధించాడు హరీశ్. అంతకు ముందు పవన్‌తో ‘గబ్బర్ సింగ్’, బన్నీతో ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలను తెరకెక్కించి విజయాలను సొంతం చేసుకున్నాడు. మరిప్పుడు చిరంజీవితో సినిమా చేస్తాడో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
							previous post
						
						
					

