డ్యాన్స్ ప్లస్ 5 సెట్స్ లో షారూఖ్ ‘నా భార్య హిందూ..నేను ముస్లిం..పిల్లలు ఇండియన్స్’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హిందూ, ముస్లిం అంటూ మాటలను అనలేదని, భార్య హిందు, తాను ముస్లిం, తన పిల్లలు హిందుస్తాన్ అంటూ వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారు అంతా చప్పట్లు కొట్టారు. పిల్లలు స్కూల్కు వెళ్లిన సందర్భంలో అక్కడ దరఖాస్తులో మతం గురించి ప్రస్తావించారని తెలిపారు. మనది ఏ మతం అని చిన్న వయస్సులో ఉన్నప్పుడు తన కూతురు అడిగిందనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాము ఇండియన్స్ అని, ఏ మతం కాదని అందులో రాయడం జరిగిందన్నారు షారూఖ్. తన ఇంట్లో మతం అంటూ ఏదీ ఉండదని, అన్ని పండుగలు జరుపుకుంటామన్నారు. తన మతం గురించి స్పందించారు. నేను ఇస్లామిక్, ఇస్లాం యొక్క సిద్ధాంతాలను నమ్ముతున్నా..ఇది మంచి మతం, మంచి క్రమశిక్షణనిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జీరో సినిమా పరాజయం అనంతరం ప్రస్తుతం షారూఖ్ ఖాన్ ఎలాంటి చిత్రాలను ప్రకటించలేదు.
My wife is Hindu, I am a Muslim and my kids are Hindustan. My daughter was asked the religion in school form, I told her we are Indians 🇮🇳 ❤️ – The pride of India Shah Rukh Khan. #RepublicDayIndia #RepublicDay2020 pic.twitter.com/Qk95xxLT3j
— Neel Joshi (@neeljoshiii) January 25, 2020