telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రొమాంటిక్ :”నా వల్ల కాదే…” ఆకట్టుకుంటున్న లిరికల్ వీడియో సాంగ్

Romantic

దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా నటిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘రొమాంటిక్’.. అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్‌పై పూరి, చార్మి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నా వల్ల కాదే’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. సునీల్ కశ్యప్ ట్యూన్ కంపోజ్ చేసి చాలా బాగా పాడాడు. భాస్కరభట్ల లిరిక్స్ రాశారు. ఈ పాట మనసుకి హత్తుకునేలా ఉంది. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

ఆకాష్ బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో కనిపించాడు. ఆ తర్వాత సోలో హీరోగా “ఆంధ్రాపోరీ” సినిమా చేసినప్పటికీ అది సక్సెస్ అవలేదు. ఆ తర్వాత డైరెక్టుగా పురి జగన్నాథ్ దర్శకతంలో “మెహబూబా” అనే సినిమా చేసినా దాని ఫలితం నిరాశ కలిగించింది. “మెహబూబా” తర్వాత “రొమాంటిక్” అంటూ మన ముందుకు రాబోతున్నాడు. మరి ఈ చిత్రం ఆకాష్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Related posts