అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను ఈ ప్రభుత్వం కావాలనే రెచ్చగొడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు బలంతో రైతుల ఉద్యమాన్ని అణచి వేయాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని అరోపించారు.
ప్రభుత్వ అణచివేత చర్యలతో ఉద్యమం హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నిర్బంధం, అరెస్ట్ లతో ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే, ఉద్యమం ఉద్ధృతం అవుతుందన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఉద్యమ అణచివేతలో భాగంగానే నిన్న చంద్రబాబును అరెస్ట్ చేశారని పవన్ దుయ్యబట్టారు.
టీఆర్ఎస్ను ఎప్పటికైనా గద్దె దించేది తామే: ఉత్తమ్