నన్కనా సాహేబ్ గురుద్వారాపై జరిగిన దాడి దేశానికి పౌరసత్వ సవరణ చట్టం అవసరమని రుజువు చేస్తోందని కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగీ పేర్కొన్నారు. పాకిస్తాన్లో మైనారిటీలు ఏమాత్రం క్షేమంగా లేరని తెలిపారు. గురుద్వారాపై రాళ్లదాడి సీఏఏ అవసరమని నిరూపిస్తోంది. పాకిస్తాన్లో సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, క్రిస్టియన్లు, హిందువులు ఏమాత్రం క్షేమంగా లేరని చూపిస్తోందని అన్నారు. మూడు దేశాల్లోని మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వడానికి భారత్ నైతికంగా కట్టుబడి ఉందని సారంగీ స్పష్టం చేశారు.
previous post
next post


ఎవరెన్ని ఎంక్వయిరీలు చేసుకున్నా భయపడం: దేవినేని