సాధారణంగా పొగ తాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆ అలవాట్లను మానుకోలేరు చాలామంది. ఇటీవల కాలంలో సెలెబ్రిటీలు పొగ తాగడం, మద్యపానం ప్రమాదకరమంటూ ప్రచారం చేస్తున్నారు. అభిమాన తారలు చెప్తే వినేవారు కొందరుంటారు కదా… ప్రభుత్వం కూడా వీలైనన్ని చర్యలు తీసుకుంటోంది. దీని ఫలితమే మనం సినిమా థియేటర్లలో చూసే ముఖేష్ యాడ్. అయినా కూడా జనాలు మారట్లేదు.
హీరోయిన్ అదా శర్మ గత కొన్నిరోజుల క్రితం స్మోకింగ్ కు వ్యతిరేకంగా ఓ వీడియోను రూపొందించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాంటీ స్మోకింగ్ వీడియో చూసిన చాలామంది అభిమానులు యాంటీ ఆల్కాహాల్ వీడియోను చేయమని కోరారు. అందుకే ఈ వీడియో అంటూ చెప్పుకొచ్చింది అందాల అదాశర్మ. మరి మీరు కూడా చూసేయండి.
భీమ్లా నాయక్‌పై రామ్‌గోపాల్ వర్మ నెగిటివ్ కామెంట్స్..