తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డం కాదని తెలంగాణ ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఫిబ్రవరిలోనే జరుగుతుందనుకున్న విస్తరణ మళ్లీ ఈనెలలో జరగవచ్చుననే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడనే దానిపై రోజుకోక తీరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు.
మంచిరోజులు లేవనే కారణంతో మంత్రవర్గ విస్తరణ వాయిదా వేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత విస్తరణ ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 30 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో ఈ ఎన్నికలు ముగిసేంత వరకు విస్తరణ ఉండదనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ కు మంత్రివర్గ విస్తరణకు అడ్డం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ప్రజావేదిక అక్రమ కట్టడమనడం జగన్ అవగాహనా రాహిత్యం: అనురాధ