నేచురల్ స్టార్ నాని తన 26వ చిత్రాన్ని నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు నాని. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌వూస్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని జనవరిలో సెట్స్‌మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి “టక్ జగదీష్” అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ విడుదల చేశారు. టక్ జగదీష్ చిత్రం తల్లి- కొడుకుల నేపథ్యంలో సాగనుండగా, ఇందులో నానికి ఆరుగురు సోదరులు ఉంటారట. ఈ చిత్రంలో నాని టక్ జగదీష్గా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తాడని చెబుతున్నారు. కాగా నాని విభిన్న పాత్రలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా “జెర్సీ” చిత్రంలో క్రికెటర్‌గా అలరించిన నాని, ఆ తర్వాత “గ్యాంగ్ లీడర్”గా వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఇక ఈసారి కాస్త వినూత్న పాత్రలో కనువిందు చేసేందుకు సిద్ధమయ్యాడు.
#Nani26 is titled as #TuckJagadish
Natural Star @NameisNani, @riturv & @aishu_dil
Directed by @ShivaNirvana
Shoot begins soon!🎹 by @MusicThaman
🎥 by #PrasadMurella
💰 by @sahrudayg & @harish_peddi under @Shine_Screens banner. pic.twitter.com/dxW61GdupG— BARaju (@baraju_SuperHit) 3 December 2019
అంతా నా విగ్రహాలు పెట్టుకోవాలి : నటి హేమ