దివంగత నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది. కెరీర్ మొదట్లో లవర్ బాయ్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ వరుస హిట్లను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఆయన. ఆయన బయోపిక్‌కి రంగం సిద్ధమవుతున్నట్టు కొన్నాళ్ళ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్‌ని వెండితెరకి పరిచయం చేసిన తేజ, బయోపిక్‌ని తెరకెక్కిస్తాడని అన్నారు. కాని అది రూమర్ అని తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా ఉదయకిరణ్ బయోపిక్ మళ్లీ వార్తలలోకి వచ్చింది. ఓ షార్ట్ ఫిలిం మేకర్ సందీప్ కిషన్‌తో ఉదయ్ కిరణ్ బయోపిక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అర్ధాంతరంగా మరణించిన యువ నటుడు ఉదయ్ కిరణ్ జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు, అందులో నటించడమే కాకుండా ఆ సినిమాకు సందీప్ కిషన్ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్త వైరల్ కావడంతో తాజాగా సందీప్ కిషన్ స్పందించాడు. తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశాడు. “ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో నేను నటిస్తున్నట్టు రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నన్నెవరూ ఇంతవరకు సంప్రదించలేదు. ప్రస్తుతం బయోపిక్‌లు చేసే ఆలోచన నాకు లేదు” అని సందీప్ క్లారిటీ ఇచ్చాడు.