తెలుగు ప్రేక్షకులకు “బొమ్మరిల్లు”తో బాగా దగ్గరైన బ్యూటీ జెనీలియా 2012 ఫిబ్రవరి 3న రితీష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంటకు 2014 లో రియాన్ అనే మగ బిడ్డ జన్మించారు. శనివారం రియాన్ బర్త్‌డే కావడంతో బుడతడి బర్త్‌డే జెనీలియా, రితేష్ దంపతులు ఘనంగా నిర్వహించారు. బర్త్‌డే వేడుకకి బాలీవుడ్ సెలబ్రిటీలు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య, షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్,అర్పిత ఖాన్, వివేక్ ఒబేరాయ్ తదితరులు హాజరయ్యారు. పార్టీని ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా జెనీలియా తన పెద్ద కొడుకును ఉద్దేశించి ఓ భావోద్వేగపూరిత లేఖ రాసింది. ఆ లేఖతోపాటు, తన కొడుకుతో కలిసి తీయించుకున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. “ప్రియమైన రియాన్.. తమ పిల్లలు పెద్దవాళ్లు అవకుండా.. బాల్యంలోనే ఉండిపోవాలని తల్లిదండ్రులు కోరుకుంటాను. కానీ, నేను అలా కాదు. నీ జీవితంలో ప్రతీ సంవత్సరాన్ని ఆస్వాదించాలని నాకు ఉంది. నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఎదగడం చూడాలని ఉంది. ఈ జీవితం చాలా కఠినమైనది. నువ్వు అంతకంటే కఠినంగా పోరాటం చేయాలని కోరుకుంటున్నా. ఏం జరిగినా నీమీద నువ్వు నమ్మకం కోల్పోకూడదని కోరుకుంటున్నా. నా జీవితంలో నేను పొందిన అతి ముఖ్యమైన వ్యక్తివి నువ్వు. నీ నవ్వు కంటే నాకింకేదీ ముఖ్యం కాదు. హ్యాపీ బర్త్‌డే రియాన్” అంటూ జెనీలియా ఆ లేఖలో పేర్కొంది.
previous post
కత్రినా నన్ను వదిలేసింది… సల్మాన్ వ్యాఖ్యలు