telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశ రాజధాని ఢిల్లీలో “లాక్ డౌన్” పొడిగింపు

దేశ రాజధానిలో “లాక్ డౌన్” మరో వారం పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. దీంతో ఢిల్లీలో జూన్ 7వ తేదీ వరకు “లాక్ డౌన్” కొనసాగనుంది. అయితే, కొన్ని షరతులతో ఉత్పత్తి, నిర్మాణ రంగ వ్యాపారాలు పునఃప్రారంభానికి అనుమతులు ఇచ్చింది సర్కార్. తిరిగి పనులు ప్రారంభించే వ్యాపార సంస్థలు చాలా ఖచ్చితంగా “కరోనా” నిబంధనలు పాటించాలని..ఉద్యోగులు ఒకేసారి సమూహంగా విధుల్లోకి రాకుండా, పలు షిప్టులలో పనిచేసేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆయా వ్యాపార సంస్థలలో విధులకు హాజరయ్యే ఉద్యోగులకు “కోవిడ్-19” నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు ప్రభుత్వ అధికారులు. ఇక ఢిల్లీలో నిన్న ( శనివారం) కొత్తగా 956 “కరోనా” కేసులు, 122 మంది “కరోనా” వల్ల మృతి చెందారు. గత రెండు నెలల గణాంకాలను పరిశీలిస్తే, ఢిల్లీలో నిన్న అత్యంత తక్కువ “కరోనా” కేసులు నమోదు అయ్యాయి. మార్చి నెలలో నమోదైన 36 శాతం నుంచి ప్రస్తుతం 1.19 శాతానికి “కరోనా” వైరస్ పాజిటివిటీ రేటు పడిపోయింది. మార్చి 22వ తేదీన ఢిల్లీ లో 21,823 “కరోనా” కేసులు నమోదు కాగా, ప్రస్తుతం వెయ్యికి లోపే కేసులు నమోదు కావడం శుభ పరిణామం. దీంతో రానున్న రోజుల్లో “కరోనా” కేసులు తగ్గే కొద్దీ, “లాక్ డౌన్” సడలింపులు పెంచుతామని సిఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. అర్ధిక కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టడం ద్వారా ఆర్ధిక స్థితిని పునరుధ్దరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. మరలా “కరోనా” కేసులు పెరిగితే, “లాక్ డౌన్” సడలింపుల ప్రక్రియను నిలుపుదల చేస్తామన్నారు. మరీ బాగా అవసరమైతే తప్పితే, బయటకు రావద్దని దేశ రాజధానివాసులకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.

Related posts