వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఇప్పటికే “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను పోలిన లుక్స్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసాడు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ని విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచిన వర్మ తాజాగా బెజవాడకు చెందిన ప్రముఖ కాపు నాయకుడు వంగవీటి రంగ తనయుడు, ఒకప్పటి వైసీపీ నేత అయిన వంగవీటి రాధ పాత్రను పరిచయం చేశారు. ఈ పాత్రలో ధన్‌రాజ్ నటించాడు. అయితే, ఈ పాత్ర పేరును సినిమాలో గంగవీటి భవాని అని పెట్టారు వర్మ. ఈ భవానీని సిట్ ఆఫీసర్ సుందరి పోలీస్ స్టేషన్లో బట్టలు విప్పించి మరీ ఇంటరాగేషన్ చేస్తోంది. ఇంతకీ ఆ సిట్ ఆఫీసర్ సుందరి ఎవరో కాదు న్యూస్ ప్రెజెంటర్, యాంకర్ స్వప్న. ఈ పోస్టర్‌ను వదులుతూ వర్మ చేసిన రెండు ట్వీట్లు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. “వంగవీటి రాధాను సిట్ ఆఫీసర్ సుందరి విచారిస్తున్నారు.. సారీ సారీ, నా ఉద్దేశం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలో గంగవీటి భవానిని” అని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. మరొక ట్వీట్ చేసిన వర్మ.. “కమ్మరాజ్యంలో కడపరెడ్లులో బెజవాడ రౌడీ వంగవీటి రాధ సన్ ఆఫ్ వంగవీటి రంగ.. సారీ సారీ నా ఉద్దేశం గంగవీటి భవాని సన్ ఆఫ్ గంగవీటి గంగ” అని వెటకారంగా పేర్కొన్నారు.
The bezawada rowdy in KAMMA RAJYMLO KADAPA REDDLU is Vangaveeti Radha s/o Vangaveeti Ranga ..Sorry sorry sorry I mean Gangaveeti Bhavani s/o Gangaveeti Ganga #KRKR pic.twitter.com/drcg46vx6q
— Ram Gopal Varma (@RGVzoomin) 7 November 2019
SIT officer Sundari interrogating Vangaveeti Radha ..Sorry sorry, I mean Gangaveeti Bhavani in KAMMA RAJYAMLO KADAPA REDDLU #KRKR pic.twitter.com/R9ndkptAJp
— Ram Gopal Varma (@RGVzoomin) 7 November 2019
నామీద నాకే అసహ్యం వేసింది : విద్యాబాలన్