తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ఆయన స్పందించారు. కేంద్ర చట్టాన్ని కేసీఆర్ చదవకుండానే మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన మోటార్ వెహికిల్ చట్టంలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ఎక్కడా లేదని అన్నారు. ఓ తండ్రిగా కేంద్రం చేసిన చట్టాన్ని కేసీఆర్ వంటి చెడ్డబ్బాయి ఉపయోగించుకోలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఆర్టీసీ కార్మికులకు ఉందని, కార్మికుల సమ్మెపై కేంద్రం స్పందిస్తుందని తెలిపారు.
							previous post
						
						
					
							next post
						
						
					

