telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తిరుపతికి తగ్గిన భక్తుల తాకిడి..

ttd plans to venkanna temples in mumbai and j & K

మన దేశంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తిరుమలలో  శ్రీవారిని దర్శించుకునే భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. నిన్నటి రోజున టిటిడి చరిత్రలోనే అత్యంత తక్కువ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 4723 మంది కాగా, 2669 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 39 లక్షలు. కాగా, దర్శన టోకెన్లు కలిగిన భక్తులను అలిపిరి వద్ద మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా టిటిడి అనుమతించనుంది. నేటి నుంచి ఏపీలో పగటిపూట కూడా కర్ఫ్యూ నిబంధనలు అమలు కానుండగా.. తిరుమలకు యథావిధిగా ఆర్టీసీ బస్సులు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. కర్ప్యూ సమయంలో కూడా భక్తుల సౌకర్యార్ధం కోసం ఆర్టీసీ తిరుమలకు బస్సులు నడపనుంది. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది.

Related posts