ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్లో తొలి విజయం అందుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. నిధి అగర్వాల్ మరో తెలుగు సినిమాలో అది కూడా ఓ డెబ్యూ హీరోతో కలిసి నటించనుంది. సూపర్‌స్టార్ మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. త్వరలోనే సెట్స్‌లోకి వెళ్లబోయే ఈ సినిమాలో అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచరం. ప్రస్తుతం నిధి తమిళంలో జయం రవి 25వ చిత్రం భూమిలో నటిస్తుంది. దిల్‌రాజు బ్యానర్లో హీరోగా ఇంట్రడ్యూస్ కావాల్సిన గల్లా అశోక్ సినిమా కొన్ని కారణాలతో ఆగింది. ఇప్పుడు మరో బ్యానర్లో గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్నాడు.
							previous post
						
						
					
							next post
						
						
					


అమితాబ్ తో సమానంగా నటించాను… అయినా… : తాప్సి