కార్తి హీరోగా రూపొందుతున్న చిత్రం “ఖైదీ”. లొకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, తిరుపూర్ వివేక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైన గుడ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. శామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నరైన్, దీనా, మరియం జార్జ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం “ఖైదీ” టైటిల్‌తోనే ఈ చిత్రం కూడా రూపొందుతుండడం విశేషం.
previous post