టాలీవుడ్ సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే నటులు బోలెడు మంది ఉన్నారు. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తమ పంచ్‌లతో హాస్యాన్ని పండిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నారు. ప్రస్తుతం కమెడియన్ గా టాప్ లో ఉన్నది వెన్నెల కిషోర్. తాజాగా నటుడు బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, దర్శకుడు అనిల్ రావిపూడి మధ్య చోటు చేసుకున్న ట్విట్టర్ కామెడీ నవ్వులు పూయిస్తోంది. విషయం ఏంటంటే.. ‘‘ఒకప్పుడు మేము క్లాస్ మేట్స్ .. సెట్స్‌పై మళ్లీ కలుసుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది’’ అంటూ అనిల్ రావిపూడితో ఉన్న ఫోటోను నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. దీనికి అనిల్ రావిపూడి వెంటనే కౌంటర్ ఇచ్చారు. ‘‘సేమ్ గ్లాసెస్ అని ఫొటో తీసి.. సేమ్ క్లాస్ మేట్స్ అంటావా” అంటూ రిప్లయ్ ఇచ్చారు. ‘‘ఏదేమైనా.. మీ సినిమాలు చూసి పెరిగాను అన్నగారూ’’ అంటూ సమాధానమిచ్చాడు. బ్రహ్మాజీ ట్వీట్‌పై వెన్నెల కిశోర్ కూడా స్పందించాడు. తనదైన శైలిలో సెటైర్ వేశాడు. ‘‘అవును.. మీ సినిమాలు చూస్తూ మా నాన్న పెరిగారు.. ఇప్పుడు నేను పెరుగుతున్నాను’’ అన్నాడు. వీరి ట్వీట్లతో నెట్టింట నవ్వుల జల్లు కురుస్తోంది.
Same Glasses ani photo teesi Same class antava 😂😂😂😂…anyhow
I grew up watching u r movies..anna garu.. 🤣 https://t.co/qbdaSmitMn— Anil Ravipudi (@AnilRavipudi) 11 October 2019


గ్లామర్ పేరిట పొట్టి బట్టలు వేసుకోలేను : అనుపమ పరమేశ్వరన్