telugu navyamedia
సినిమా వార్తలు

ఆ హీరో నన్ను వేధించాడు : రెజీనా

Rejina

రెజీనా తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగులో యంగ్ హీరోల పక్కన నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో వచ్చిన వరుస ఫ్లాప్స్ ఆమెని హీరోయిన్ల రేసులో బాగా వెన‌క్కు నెట్టేశాయి. దాంతో రెజీనా కొంతకాలంగా టాలీవుడ్ కి దూరమైంది. కోలీవుడ్లో తన హవా చూపిస్తున్న రెజినాకు తాజాగా “ఎవరు”తో తెలుగులో అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో అడవి శేషు హీరోగా రెజీనా, నవీన్ చంద్ర కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో తన పాత్ర గురించి చెబుతూ మంచి చాన్స్ ఇది అంటోంది రెజీనా. ఈ నెల 15న వస్తున్న ఈ మూవీలో 80 శాతం తన మీదే సినిమా రన్ అవుతుందని కూడా రెజీనా చెబుతోంది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానని తాను అనుకుంటున్నట్లుగా కూడా అమె చెబుతోంది. అయితే ఈ మూవీ తనకు పెద్ద అనుభవం అని కూడా అంటోంది. ఈ మూవీలో హీరో అడవి శేష్ తనని ఓ విధంగా టార్చర్ చేశాడని షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ అమ్మడు. ఆన్ స్ర్కీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా అడవిశేషు తనని బాగా వేధించాడని, అయితే అది పాత్ర బాగా రావాలని మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఈ వేధింపులు ఫన్ గా మాత్రమేనని, చాలా హ్యాపీ మూడ్ లో సినిమా షూటింగ్ ముగిసిందని రెజీనా చెబుతోంది. తనకు పాత్ర ముఖ్యమని, ఇక హిట్లు, ఫట్లు ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందేనని రెజీనా చెబుతోంది. తన వరకూ పాత్ర బాగుంటే హిట్ అనుకుంటానని అంటోంది.

Related posts