telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మ్మార్పీకి మించి మద్యం అమ్మితే రూ.2 లక్షల జరిమానా

liquor shops ap

వైన్‌ షాపుల యజమానులకు తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ సీరియస్‌ వార్నంగ్‌ ఇచ్చింది. దసరా పండగ సందర్భంగా మద్యం ఎమ్మార్పీకి మించి అమ్మితే రూ.2 లక్షల జరిమానా విధించడంతోపాటు వారం రోజులు షాపు లైసెన్స్‌ సస్పెండ్‌ చేస్తామని వైన్‌ షాపుల యజమానులను ఎక్సైజ్‌ శాఖ హెచ్చరించింది.

శుక్ర,శనివారాలలో హైదరాబాద్‌, నల్గొండ, వనపర్తి, నిజామాబాద్‌ జిల్లాల్లోని 8 వైన్‌ షాపుల్లో ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మినట్టుగా స్పెషల్‌ టీమ్‌లు గుర్తించాయని పేర్కొంది. దసరా పండగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ఏ వైన్‌ షాపు యాజమాని ప్రయత్నించినా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లకు అదనంగా స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Related posts