న్యూయార్క్ సిటీలో బాంక్స్ జంతు ప్రదర్శనశాలకు వెళ్లిన ఆ మహిళ… ఉన్నట్టుండి సింహం బోనులోకి దూకింది. కాసేపు సింహం వైపు చూస్తూ నిలబడింది. దీంతో సింహానికి కూడా ఏం చేయాలోతెలీక మహిళనే చూస్తూ నిలబడిపోయింది. ఆ తరువాత సదరు మహిళ..సింహం ముందు డాన్స్ చేస్తున్నట్టు చేతులాడించింది. అయితే.. అదృష్టవశాత్తూ ఆమెకు ఏమీ కాలేదు. క్షేమంగా బోనులోంచి బయటపడింది. కాగా… ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు సదరు మహిళపై మండిపడుతున్నారు. “సింహం నీమీద దాడి చేసుంటే..నిన్ను రక్షించడానికి ఓ అమాయక జీవిని చంపాల్సి వచ్చేది. నీకు బుధ్ది ఉందా లేదా” అంటూ కొందరు నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఎవరూ ఇప్పటి వరకూ ఫిర్యాదు చేయకపోవడంతో సదరు మహిళపై ఎటువంటి చర్యా తీసుకోలేదని తెలుస్తోంది.
Crazy woman climbs into a lion’s enclosure at the Bronx Zoo. Even the lion is shocked. 🦁 pic.twitter.com/plWfkL6pGZ
— Tim Xeriland (@Xeriland) 2 October 2019