అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. కాన్సస్ నగరంలో ఒక బార్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మరణించారు. కాగా మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఆదివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 6.30 గంటల ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగింది.
మిస్సౌరీలోని కాన్సాస్ సిటీలోని సెంట్రల్ స్ట్రీట్స్ వద్ద ఒక దుండగుడు బార్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.