ముంబైలో నగరంలోని జలపాతాన్ని తలపిస్తున్నట్టున్న ఓ బిల్డింగ్. దక్షిణ ముంబైలో ఉన్న ఓ 40 అంతస్తుల భవనం నుంచి నీరు జలపాతలం కిందకు దూకుతున్నది. బిల్డింగ్ నుంచి జాలువారుతున్న నీటిని చూసి జనం షాకయ్యారు. కఫే పరేడ్ ఏరియాలో ఉన్న ఆ బిల్డింగ్ వీడియోను తీసి కొందరు ఆన్లైన్లో పోస్టు చేశారు. దీంతో అది వైరల్ అయ్యింది. బిల్డింగ్ మీద ఉన్న వాటర్ ట్యాంక్లో చీలికలు రావడంతో దాంట్లో ఉన్న నీరు కిందకు దూకుతున్నట్లు స్థానికులు గుర్తించారు.
జలపాతంలా జారుతున్న నీరు.. వర్షపు నీరు కాదని తేల్చారు. గత రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఆ వర్షం వల్ల బిల్డింగ్ జలపాతంలా మారిందా అన్న సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి.
Waterfalls in New Cuffe Parade! #MumbaiRains pic.twitter.com/eqPQhGf73V
— K Sudarshan (@SudarshanEMA) 2019


సమాజంలో మహిళల పట్ల చులకనభావం పోవాలి: కోదండరాం