నటగురువు దేవదాస్ కనకాల శుక్రవారం సాయంత్రం మరణించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. శనివారం ఉదయం హైదరాబాద్లోని కొండాపూర్ కిమ్స్ నుంచి మణికొండ మర్రిచెట్టు సమీపంలోని ఆయన స్వగృహానికి పార్థీవ దేహాన్ని తీసుకొచ్చారు. అనంతరం హైదరాబాద్ మహాప్రస్థానంలో దహన సంస్కరాలు పూర్తి చేశారు. తనయుడు రాజీవ్ కనకాల.. ఆయన అంత్యక్రియలను పూర్తి చేశారు. దేవదాస్ కనకాల మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించుకున్న అనంతరం కనకాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న చిరంజీవి, రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, సమీర్, బ్రహ్మాజీ, హేమ సహా పలువురు సినీ ప్రముఖులు దేవదాస్ కనకాల ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు. నాటక రంగం నుండి సినిమా రంగంలోకి ప్రవేశించిన దేవదాస్ కనకాల టాలీవుడ్లో ఎందరో నటీనటుల్ని తీర్చిదిద్దారు. చిరంజీవి, రాజేంద్రప్రసాద్ తదితరులకు ఆయన నటనలో శిక్షణనిచ్చారు.


కమల్ పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు