టెంపర్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ సినిమా ఇటు రామ్‌కి, అటు పూరీకి చెప్పలేనంత ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకునేందుకు చిత్ర బృందం పలు ప్రాంతాలలో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ ను ఈ డైరెక్టర్ తెలుగులో ఏ హీరోతో సినిమా చేస్తారోననే ఆసక్తి నెలకొంది. అయితే పూరి తాను “డబుల్ ఇస్టార్ట్” స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నానని ఇప్పటికే ప్రకటించారు. అయితే అంతకంటే ముందే పూరి ఎప్పటి నుండో తన దగ్గరే ఉండిపోయిన “జనగణమన” సినిమాను రూపొందించాలని భావిస్తున్నారట. నిజానికి పూరి ఈ స్ర్కిప్ట్‌ను మహేష్ బాబు కోసం రాసుకున్నారు. ముందుగా ఈ టైటిల్‌తో మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు పూరి జగన్నాథ్ ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇప్పటికే మహేష్ బాబు కోసం చాలా రోజులు వెయిట్ చేసిన పూరీ ఎట్టకేలకు మహేష్ పక్కన పెట్టి మరో హీరోతో సినిమా చేయబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. గత ఏడాది “కె.జి.యఫ్ చాప్టర్ 1″తో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో హిట్ అందుకున్న కన్నడ రాక్ స్టార్ యష్. ప్రస్తుతం యష్ “కె.జి.యఫ్ చాప్టర్-2” చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అది పూర్తి కాగానే యష్‌తో పూరి “జనగణమన”ను తెరకెక్కిం చాలనుకుంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సమకాలీన పరిస్థితులకు తగినట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేసిన పూరి జగన్నాథ్ ఇటీవలే కథను యష్‌కు వినిపించినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హత్యాచార ఘటనలు, నేరాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలిసింది. తెలుగు, కన్నడ భాషల్లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.
previous post