మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా “రామారావు” ఆన్ డ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా క్రిస్మస్ విషెస్ చెబుతూ మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ వృద్ధ దంపతులకు డబ్బులు ఇస్తున్నట్టు కనిపిస్తున్నాడు.
యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శరత్ మాండవ దర్శకత్వం వహిస్తుండగా.. దివ్యాంశ కౌషిక్ హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. వచ్చే ఏడాది 2022 మార్చి 25న సినిమా రిలీజ్ కానుంది