“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ వినూత్నమైన ప్రమోషన్స్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సాహో చిత్రానికి సంబంధించి రొమాంటిక్ పోస్టర్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా యాక్షన్ సీన్‌కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కూడా అభిమానులని ఆకట్టుకుంటుంది. ఇలాంటి యాక్షన్ సీన్ మరెప్పుడు చూసి ఉండరు అని టీం చెబుతుంది. చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలు, టీజర్స్ సినిమాపై భారీ ఆసక్తిని పెంచాయి. సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Get ready for the action like never before #Saaho in cinemas from 30th Aug, 2019#Prabhas @ShraddhaKapoor @NeilNMukesh @arunvijayno1 @sujeethsign @UV_Creations @itsBhushanKumar @TSeries #SaahoOnAugust30 pic.twitter.com/WIW3EhOC65
— BARaju (@baraju_SuperHit) July 25, 2019



పవన్ కళ్యాణ్ పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు