“శ్రీనివాస కళ్యాణం” చిత్రం అనుకున్న విజయాన్ని అందించకపోవడంతో తర్వాత సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతోంది “భీష్మ”. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం “భీష్మ” షూటింగ్‌తో నితిన్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాలోని నితిన్ లుక్ బయటకు వచ్చింది. పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లకుండా డీసెంట్ లుక్‌తో స్మార్ట్‌గా ఉన్న నితిన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. పెళ్లి అంటే ఇష్టం లేని ఓ కార్పొరేట్ ఉద్యోగి పాత్రలో నితిన్ కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కాగా.. దానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే చంద్రశేఖర్ ఏలేటి, వెంకీ అట్లూరి సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
next post
సుశాంత్‌లో ఆమె ఆశలు రేకెత్తించింది… : కంగనా కామెంట్స్