దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత సరికొత్త లుక్ లో కనిపించనుంది. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే సినిమా ప్రీమియర్ షోలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాను చూసిన వారు సమంతను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సినిమాలో కామెడీ అండ్ ఎమోషన్ సమపాళ్లలో ఉన్నాయంటూ ట్విట్టర్ లో వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక రాజేంద్రప్రసాద్, నాగ శౌర్య, ఇతర పాత్రలు సినిమాలో లీనమయ్యేలా చేశాయి. ఇక సినిమాలో క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంధని చెబుతున్నారు. ఫైనల్ గా ఓ బేబీ ప్రీమియర్స్ తో పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతోంది.