ఫ్లోరిడాకు చెందిన ఓ రెస్టారెంట్లో దొంగతనానికి వెళ్లిన పాట్రిక్ బెన్సన్ అనే 34 ఏళ్ళ వ్యక్తి ఆకలి వేయడంతో రెస్టారెంట్లో తనకు తానే బర్గర్లను తయారు చేసుకుని తినడమే కాకండా కడుపు నిండాక రెస్టారెంట్లో తనకు కావాల్సిన వస్తువులను దొంగిలించి వెళ్లిపోయాడు. అయితే ఇదంతా సెక్యూరిటీ కెమెరాలలో రికార్డు కావడంతో అతను చివరకు పోలీసులకు చిక్కాడు. బెన్సన్ రెస్టారెంట్ కిటికీని పగులగొట్టి లోపలకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. బెన్సన్ ఇప్పటివరకు అనేక రెస్టారెంట్లలో దొంగతనం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. రెస్టారెంట్లలో దొంగతనానికి వెళ్లి అక్కడి తినుబండారాలు తినడం సహజమని, అయితే బెన్సన్ తనంతట తానే తయారుచేసుకుని మరీ తినడం ఆశ్చర్యమని పోలీసులు అన్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					

