టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోయిన్ల సరసన అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతోంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది రకుల్. సినీ రంగంలోకి ప్రవేశించి దశాబ్దం కావొస్తున్నా ఇప్పటికీ అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తూ అవకాశాలు అందుకుంటోంది. అయితే తమ కష్టాన్ని ప్రజలెవరూ గుర్తించరని, సినిమా జయాపజయాలను బట్టే తమకు అవకాశాలు వస్తాయని తాజాగా రకుల్ చెప్పుకొచ్చింది. “కెమెరా ముందు కంటే వెనుకే మేము చాలా కష్టపడతాం. డైట్ విషయంలోనూ, వ్యాయామం విషయంలోనూ చాలా కఠినంగా ఉంటాం. అందరు హీరోయిన్లూ అలాగే ఉంటారు. అయితే మేం పడే కష్టాలు ఇక్కడ మిగతా వారికి అనవసరం. జయాపజయాలనే ఇక్కడ కొలమానంగా తీసుకుంటారు. ఎంత కష్టపడి సినిమా చేసినా కొన్ని సార్లు ఫలితం దక్కుతుంది, కొన్ని సార్లు దక్కదు” అని రకుల్ చెప్పింది.
previous post