ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నిన్న ఏపీ కేబినెట్ కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ నేసథ్యంలో సోమవారం తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై కేబినెట్ చర్చించనుంది. కీలకమైన 8 అంశాలపై కేబినెట్‌లో చర్చ జనగనున్నట్లు సమాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చ జరగనున్నట్లు తెలియవచ్చింది.
అలాగే పెన్షన్లు, ఆశా కార్యకర్తల వేతనాల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.అసెంబ్లీ ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన సభాస్థలిలో శనివారం 25మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీసీ, ఎస్సీ, కాపు, గిరిజన, మైనారిటీలకు కేబినెట్‌లో స్థానం కలిపించారు.
ట్రంప్ శిష్యుడు జగన్…