సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “దొరసాని”. ఈ చిత్రంతో కేవీఆర్ మహేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు. సన్ని కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. నిజ జీవితానికి దగ్గరగా ఎంతో రియలిస్టిక్‌గా తెరకెక్కుతున్న “దొరసాని” చిత్రం తెలంగాణలోని ఓ ప్రాంతంలో 80వ దశకంలో జరిగిన కథగా వస్తోంది. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో రాజుగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్, దొరసానిగా శివాత్మిక లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా చిత్ర టీజర్ విడుదల కాగా ఇందులో రాజు, దొరసానిల ప్రేమ, వైరుధ్యం కనిపిస్తున్నాయి. మరి ఈ టీజర్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
							previous post
						
						
					
							next post
						
						
					

