telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

మరో రెండు రోజులలో .. వాతావరణం చల్లబడనుండి..

temp going down in cities

నిన్నమొన్నటి వరకు ఎండల వేడికి తహతహలాడిపోయిన వారికి ఊరట లభించనుంది. మరో రెండు రోజులలో వాతావరణం చల్లబడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మే నెలఖరు వరకు భానుడి భగ…భగలతో ఉక్కిరి బిక్కరైన నగరం ఒక్కరోజులో చల్లబడటంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం (జూన్ 1)న హైదరాబాద్‌లో గరిష్ఠంగా 35.3, 27.1 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 24 గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పడిపోవడంతో వాతావరణం చల్లబడింది. రెండురోజుల క్రితం వరకు సాధారణ కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదైన ఉష్ణోగ్రతలు ఒక్కరోజు తేడాలో సాధారణం కంటే 4 డిగ్రీలు తగ్గిపోయాయి. శనివారం పలు ప్రాంతాల్లో జల్లులు కురవడంతోపాటు రోజంతా వాతావరణం చల్లగా ఉండటంతో వేడి తీవ్రత తగ్గింది.

మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు 37-38 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలతోపాటు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని అధికారులు తెలిపారు. మరో రెండు రోజులపాటు జల్లులు ఉత్తర కోస్తాంధ్ర, ఆ పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ నుంచి 2.1 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గల్ఫ్‌ ఆఫ్‌ మార్డ్‌ బాన్‌ నుంచి దక్షిణ కోమోరిన్‌, మాల్దీవుల ప్రాంతం వరకు 3.1 కి.మీ నుంచి 4.5 కి.మీ మధ్య ఆవర్తనం కొనసాగుతుందని ఈ ప్రభావంతో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

Related posts