తెలుగుతోపాటు తమిళంలోనూ విజయవంతమైన సినిమాలు చేసి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం తెలుగులో “సైరా”, “దటీజ్ మహాలక్ష్మి” సినిమాలు చేస్తోంది. హిందీలో ప్రభుదేవాతో రెండు సినిమాలు, తమిళంలో విశాల్‌తో ఒక సినిమా చేస్తోంది. ప్రభుదేవాతో నటించిన “దేవీ-2” సినిమా ప్రమోషన్లో భాగంగా పెళ్లి గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించింది. “నేను పెళ్లికి సిద్ధంగానే ఉన్నాను. మంచి వరుడు దొరకడమే ఆలస్యం. మంచి పెళ్లి కొడుకు ఉంటే చెప్పమని దర్శకుడు విజయ్‌కు కూడా చెప్పాను. మీలో కూడా ఎవరైనా మంచి వ్యక్తిని సూచిస్తే అతణ్ని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ` అని చెప్పింది. అలాగే “సైరా” సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో నటించానని, భవిష్యత్తులో కూడా ఐటెం సాంగ్‌లో నటించడానికి సిద్ధమే” అని తెలిపింది.
							previous post
						
						
					
							next post
						
						
					

