మంగళగిరి యోజకవర్గంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. నారా లోకేశ్ కు ప్రత్యక్ష రాజకీయాలపై ఏమాత్రం అవగాహనలేదని మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేశ్ ఏ విధంగానూ తనతో పోటీకి సరిపోడని అభిప్రాయపడ్డారు.
ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు కొడుకును బరిలో దింపారని ఆళ్ల విమర్శించారు. ఆ విధంగా లోకేశ్ ఓటమికి చంద్రబాబే పరోక్షంగా కారకులయ్యారని ఆరోపించారు. జగన్ పాలనపై ఎవరూ ఎలాంటి అపోహలకు గురికావాల్సిన పనిలేదన్నారు. ముఖ్యంగా రైతులు ఏ విషయంలోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.


పృథ్వీ షా పై పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు…