టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు విరిచుకుపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మాటలు జాగ్రత్తగా రానీ కేటీఆర్. నేను రెచ్చిపోతే మీ ప్రభుత్వం పడిపోతుంది’ అని హెచ్చరించారు. నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి కేటీఆర్ ఇంకా పుట్టనేలేదని, అలాంటి ఆయన నన్ను బఫూన్ అంటున్నాడని మండిపడ్డారు.
కేటీఆర్ తన బావమరిది స్నేహితుడికి టెండర్ అప్పగించారన్నారు. బావమరిది మీద మోజుతో 22 మంది విద్యార్థులను కేటీఆర్ బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలు ఫిరాయించే నేతలపై ప్రజలు తిరగబడాలనీ వీహెచ్ పిలుపునిచ్చారు.
ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్‌రెడ్డి