ఈ ఏడాది దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. 2019 నైరుతి రుతుపవనాల వర్షపాతంపై అంచనాలను వెల్లడించింది. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో కేరళను రుతుపవనాలు తాకనున్నట్టు తెల్పింది. రైతులకు ఖరీఫ్ సీజన్ ఉపయోగకరంగా ఉంటుందని, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. జూన్ లో వర్షపాతంపై రెండో విడత అంచనాలను విడుదల చేస్తామని పేర్కొంది. దీర్ఘకాలికంగా 96 శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.
next post


నేను ఎవరికి భయపడను.. నన్నెవరూ భయపెట్టలేరు..-గవర్నర్