మాండ్యా నియోజకవర్గంలో అత్యంత ఆసక్తికర పోరు జరుగుతున్న వేళ, జేడీ(ఎస్) యువనేత, నటుడు నిఖిల్ కుమార్ పై పోటీకి దివంగత నటుడు అంబరీష్ భార్య సుమలత పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే నియోజకవర్గం నుంచి సుమలత అనే పేరున్న మరో ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కనకపుర ప్రాంతానికి చెందిన పి. సుమలత, శ్రీరంగపట్న ప్రాంతానికి చెందిన సుమలత, కేఆర్ పేట్ తాలూకాకు చెందిన ఎం సుమలత పోటీలో ఉన్నారు.
వీరు ముగ్గురూ స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలో ఉన్నప్పటికీ, ఈవీఎంలలో సుమలత అన్న పేర్లన్నీ ఒకే చోట ఉండటంతో ఓటర్లు, అయోమయంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఓ బలమైన అభ్యర్థిని ఓడించాలన్న ఉద్దేశంతో ఈ తరహాలో ఒకే పేరున్న వాళ్లను రంగంలోకి దించడం సర్వ సాధారణమే. ఓటర్లను గందరగోళ పరిచే ఉద్దేశంతోనే ఈ తరహా కుట్రలు చేస్తున్నారని సుమలత వర్గం ఆరోపిస్తోంది. ఓటర్లంతా సుమలత ఫోటోను చూసి మాత్రమే ఓటు వేయాలని వారు ప్రజలకు చెబుతున్నారు.
ఇలాంటి చీప్ ఐడియాలతో ప్రస్తుత ఎన్నికలలో ముందుకు పోతున్నాయి చాలా పార్టీలు. తాజాగా వైసీపీ అభ్యర్థుల పేర్లతో సమానంగా కే.ఏ.పాల్ పార్టీ అభ్యర్థుల పేర్లు దాదాపు 35 ఉండటం గమనార్షం. ఎన్నికలలో ట్రిక్కులు చేసి తప్ప గెలవలేని స్థితిలో పార్టీలు అన్నీ ఉన్నాయి. అలాంటి పార్టీలతో ప్రజాస్వామ్యం నిలబడుతుందా.. చచ్చిపోతుందా .. అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.
ఉద్యోగం కావాలంటే పరాయి రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా?: చంద్రబాబు