మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడుగా ప్రముఖ నటుడు సీనియర్ నరేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయానికి సంబంధించి “మా”జీ అధ్యక్షుడు శివాజీరాజాకు, నరేష్ కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చిన విషయం తెలిసిందే. “మా” కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాటను సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు దంపతుల చేతుల మీదుగా విడుదల చేశారు. అయితే నరేష్ ప్రమాణస్వీకారానికి శివాజీరాజా కూడా హాజరయ్యారు. రెండు సంవత్సరాల పాటు ‘మా’ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, దానికి అందరి సహకారం కావాలని ఆయన కోరారు. మా అసోసియేషన్‌కి తన వంతుగా 1,1116 రూపాయలను విరాళంగా అందజేశారు నరేష్. ‘మా’లో సభ్యత్వ రుసుమును లక్ష నుండి 90 వేలకు తగ్గించారు. ప్రతి ‘మా’ సభ్యులకు ‘మా’ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణ- విజయనిర్మల దంపతులు, కృష్ణంరాజు, కోట శ్రీనివాస్ రావు తదితరులు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ “మా” కమిటీ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, ఎప్పటిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. అంతేకాదు ”నాకంటే ముందు అధ్యక్షులుగా పని చేసిన వారు ఎక్కడినుండో ఫండ్స్ తీసుకొచ్చి పెట్టామని, దాంట్లో నుండి పైసా కూడా కదపకుండా చూసుకున్నామని, మీరు కష్టపడి బయటనుండి ఫండ్స్ తీసుకురావాలని, ఇప్పుడు పని చేయబోయే కమిటీ కూడా కష్టపడాలని ఆశిస్తున్నాను” అంటూ కమిటీకి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని చెప్పుకొచ్చారు శివాజీరాజా.
వైఎస్ జగన్ పులివెందుల పులిబిడ్డ: సినీనటి రమ్యశ్రీ