telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుకు పవన్ పార్ట్నర్: వైఎస్ జగన్

Ycp Jagan comments chandrababu Pawan

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్ట్నరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో నామినేషన్ చేసే ముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. వైసీపీ ఓట్లు చీల్చేందుకే చంద్రబాబు తెరపైకి పవన్ ను తీసుకు వచ్చారని ఆరోపించారు. ఇరు పార్టీల మధ్య అవగాహన ఉందని చెప్పుకొచ్చారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను మెుదట చంద్రబాబు టీడీపీలోకి తీసుకోవాలని భావించారని ఆయనను భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యించాలని కూడా చూశారని జగన్ స్పష్టం చేశారు. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఆయనను తన పార్ట్నర్ పార్టీలోకి పంపించారని ఆరోపించారు. అంతేకాకుండా లక్ష్మీనారాయణకు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సీటు కూడా ఇప్పించారన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ రైటర్, నిర్మాత చంద్రబాబేనని వ్యాఖ్యానించారు.

Related posts