శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఆయన గుండెపోటుతో మరణించాడని అంతా భావించారు. కానీ పోస్టు మార్టం రిపోర్టులో ఆయనది హత్యేనని, ఆయన శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని స్పష్టం కావడంతో సంచలనంగా మారింది. ఈ విషయం వైఎస్ కుటుంబాన్ని మరింతగా కలచివేసింది. తాజాగా మంచు ఫ్యామిలీ కూడా వివేకా మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వివేకా హత్యపై కొందరు రాజకీయాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులపై మంచు విష్ణు ఫైర్ అయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై కొందరు రాజకీయ నాయకులు చేస్తోన్న కామెంట్స్ వింటుంటే వారికి కనీసం మానవత్వం కూడా లేదనిపిస్తోంది. ఇలాంటి క్రూరమైన చర్యలను ఖండించకుండా నీచంగా మాట్లాడుతున్నారని, చావుని కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటూ, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Humanity seems to be going down the drain when I hear some politicians talk about the murder of YS Vivenkananda uncle. Instead of condemning the heinous act, politicizing and mud slinging seems to be in the pea sized brains.
— Vishnu Manchu (@iVishnuManchu) March 16, 2019