telugu navyamedia
సినిమా వార్తలు

“మా” రచ్చ : శివాజీరాజాపై నరేష్ ఫైర్

Naresh-and-Shivaji-Raja

ఇటీవల జరిగిన “మా” – మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్, శివాజీరాజా ప్యానెల్ పోటీ పడ్డారు. అందులో ఎక్కువ ఓట్లతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు నరేష్ “మా” అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. నరేష్ ప్యానెల్ ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించడానికి ముహూర్తం పెట్టుకుంది. అయితే శివాజీరాజా మాత్రం తమకు మార్చి 31 వరకు గడువు ఉందని, అది కాదని ప్రమాణ స్వీకారం చేస్తే కోర్టుకు కూడా వెళ్తామని అంటున్నారని నరేష్ మీడియా ముందు వెల్లడించారు. అంతేకాదు పెండింగ్ లో ఉన్న చెక్కులపై సంతకాలు చేయడానికి కూడా పూర్వ సభ్యులు సహకరించడం లేదని, తనకు కుర్చీ పిచ్చి లేదని, చట్టపరంగా ఎన్నికల్లో గెలిచినా తరువాత ఎప్పుడైనా బాధ్యతలు స్వీకరించే హక్కు తమకు ఉంటుందని, పెద్దలను సంప్రదించి ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని నరేష్ అన్నారు. మరి ఇప్పుడు పెద్దలు ఏం నిర్ణయిస్తారో చూడాలి.

Related posts