telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి నారాయణ ఖండించారు

అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి నారాయణ ఖండించారు.

శనివారం నాడు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద మీడియాతో మంత్రి మాట్లాడుతూ వైసీపీ దృష్టిలో రాష్ట్ర రాజధాని ఎక్కడో చెప్పాలన్నారు.

అమరావతి రాజధాని అని తమకు పూర్తి క్లారిటీ ఉందని వైసీపీ కూడా రాజధానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రివర్ బెడ్‌కు రివర్ బేసిన్‌కు తేడా తెలియకుండా మాట్లాడారని వ్యాఖ్యలు చేశారు. చాలా నగరాలు రివర్ బేసిన్‌లోనే మహా నగరాలుగా అభివృద్ధి చెందాయని మంత్రి తెలిపారు.

రైతులతో మాట్లాడటానికి ఇష్టపడని నాయకులు ఇప్పుడు లేనిపోని ప్రేమ చూపిస్తారని మంత్రి నారాయణ మండిపడ్డారు.

గత ప్రభుత్వ నిర్వాకంతోనే అమరావతి పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని విమర్శలు గుప్పించారు.

అమరావతి నిర్మాణ పనులకు పారదర్శకంగా టెండర్లు పిలిచామని స్పష్టం చేశారు. రాజధానిపై బురద జల్లే ఉద్దేశంతో అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ సెక్రటేరియట్‌లో కేవలం మంత్రులు, వారి శాఖలు, అధికారులు మాత్రమే ఉండేలా నిర్మించారన్నారు.

కానీ అమరావతిలో నిర్మించే సెక్రటేరియట్‌లో మంత్రులు, సిబ్బంది, హెచ్‌వోడీలు, ఇతర కార్పొరేషన్లు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తున్నామని వివరించారు.

ప్రజలకు పాలన దగ్గరగా ఉండే విధంగా అన్ని నిర్మాణాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాజధానిపై మాట్లాడే ముందు జగన్ స్టడీ చేసి మాట్లాడాలని మంత్రి నారాయణ హితవుపలికారు.

Related posts