“కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, సంతోషంగా, ఆర్థికంగా బలంగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించాను.
తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని విక్రమార్క ట్వీట్ చేసారు.

