కర్ణాటక బళ్లారి నగరంలో బ్యానర్ల కట్టే విషయంలో ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి వర్గానికి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భారత్ రెడ్డి వర్గానికి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మరణించగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాలి జనార్ధన రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా పది మందికిపై బ్రూస్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
వీరితోపాటు మోత్కార్ శ్రీనివాస్, ప్రకాష్ రెడ్డి, రాముడు, పలన్న, దివాకర్, మారుతి ప్రసాద్, దమ్మూర్ శేఖర్‌తోపాటు అలీఖాన్‌పై కేసు నమోదు చేశారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు చానల్ శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. పెట్టిన బ్యానర్లు తొలగించారని దుర్వినియోగం చేయడమే కాకుండా దౌర్జన్యానికి సైతం పాల్పడ్డారంటూ వారిపై కేసు నమోదు చేశారు.
అలాగే గుంపులుగా రాళ్లు, కర్రలు, కొడవళ్లు, సోడా బాటిళ్లతో తమపై దాడికి వచ్చారని ఎమ్మెల్యే వర్గం ఆరోపించింది.

