telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.

స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఇటీవల మంత్రి లోకేష్ కు ఆహ్వాన లేఖను పంపారు.

మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.

ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది.

ఇందులో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల 19-24నడుమ ఆస్ట్రేలియాలోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి అక్కడి అధునాతన విద్యావిధానాలపై అధ్యయనం చేస్తారు.

దీంతోపాటు నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతం చేయాలని కోరుతూ రోడ్ షోల్లో పాల్గొంటారు.

ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం 19వ తేదీ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సిడ్నీ చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు.

20వ తేదీ ఉదయం 9 గంటలకు రాండ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ ను సందర్శిస్తారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యాన న్యూసౌత్ వేల్స్ ఎంపీలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ల సమావేశంలో పాల్గొంటారు.

సాయంత్రం 3 గంటలకు ఆస్ట్రేలియా స్కిల్స్ & ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్ తో కలిసి TAFE NSW Ultimo క్యాంపస్ ను సందర్శిస్తారు.

సాయంత్రం 6.30 గంటలకు NSW పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు.

21వ తేదీన ఉదయం 8.30 గంటలకు పర్రమట్టలో సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా నిర్వహించే సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ (CIAR) ఆక్వా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు.

11 గంటలకు వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం 2 గంటలకు న్యూసౌత్ వేల్స్ ఇన్నొవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అనౌలాక్ చాంథివోంగ్, స్కిల్స్, టెరిటరీ ఎడ్యుకేషన్ మంత్రి స్టీవ్ వాన్ తో సమావేశమవుతారు. 22వ తేదీన ఉదయం 9 గంటలకు గోల్డ్ కోస్ట్ సౌత్ పోర్టులోని గ్రిఫిత్ యూనివర్సిటీని సందర్శిస్తారు.

Related posts