శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో “సూర్యప్రభ వాహనం” తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తాడు.
సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి.
సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు, సూర్యదేవుని అనుగ్రహం సిద్ధిస్తాయి అని భక్తులు నమ్ముతారు.