కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని ఆ శ్రీవారిని దర్శించుకుని పుణీతులయ్యారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ అద్భుతం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రహ్మోత్సవాలపై సీఎం సోషల్ మీడియాతో ఎక్స్ వేదికగా స్పందించారు.
“తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీ మలయప్ప స్వామి వారి గరుడ వాహన సేవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి అభినందనలు.
ఆదివారం నాటి పరమ పవిత్ర గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన 3 లక్షల మందికిపైగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారికి మంచి అనుభూతిని మిగిల్చారు.
బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన, సమన్వయంతో వ్యవహరించిన టీటీడీ బోర్డుకు, దేవస్థానం అధికారులకు, ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, ఆ శాఖ సిబ్బందికి అభినందనలు.
తిరుమల కొండ పవిత్రతను కాపాడుతూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించిన భక్త కోటికి ధన్యవాదాలు” అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు.